బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద అభివృద్ధి కి మంజూరు అయిన చెరువులపై ప్రత్యేక పరిశీలన

మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద అభివృద్ధి కి మంజూరు అయిన చెరువులపై ప్రత్యేక పరిశీలన

మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అలీమ్ బాషా గారు పరిధిలో గల ప్రతిపాదన లో ఉన్న 7 చెరువులు (కాజా, చిన కాకాని, నూతక్కి, ఆత్మకూరు, పెనుమాక, నవులూరు, నిడమర్రు)పై సమగ్ర పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చెరువుల ప్రస్తుత పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు.పరిశీలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ విభాగం అధికారులు మరియు ఇంజినీరింగ్ సిబ్బందితో కమిషనర్ విస్తృతంగా పర్యటించారు చెరువుల పునరుద్ధరణ, బండ్ నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, పర్యావరణ పరిరక్షణ చర్యలు మరియు అందాల వృద్ధి (బ్యూటిఫికేషన్) కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

ప్రత్యేకంగా అమృత్ పథకం (AMRUT Scheme) కింద ఈ చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని కమిషనర్ సూచించారు. చెరువుల పరిసర ప్రాంతాలను శుభ్రపరచడం, వాకింగ్ ట్రాక్‌లు, హరిత వాతావరణం ఏర్పరచడం, ప్రజలకు విశ్రాంతి స్థలాలుగా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమం ద్వారా నగర పాలక సంస్థ పరిధిలోని చెరువులను పునరుద్ధరించి పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడం లక్ష్యంగా ఉందని కమిషనర్ తెలిపారు.ఈ పరిశీలనలో అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్