బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

వెంకయ్య చౌదరి సేవా నిరతి స్ఫూర్తిదాయకం

వెంకయ్య చౌదరి సేవా నిరతి స్ఫూర్తిదాయకం

మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మన్నెం వారి వీధిలో బుధవారం పట్టణ విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ వడ్లమూడి వెంకయ్య చౌదరి ప్రధమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వెంకయ్య చౌదరి చిత్రపటానికి వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడారు. వెంకయ్య చౌదరి స్వయంకృషితో అంచలంచెలు ఎదిగి వ్యాపార రంగంలో రాణిస్తూ ఎన్నో దేవాలయాలకు విరాళాలు ఇచ్చి ఆలయాల అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. ట్రస్ట్ ఏర్పాటు చేసి సమాజంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం తోపాటు దేవాలయాల వద్ద ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపట్టి పలువురు భక్తుల మన్ననలు పొందారన్నారు. ఆయన సేవలు మరువరానివి అన్నారు. వెంకయ్య చౌదరి సేవా నిరతి పలువురికి స్ఫూర్తిదాయకమన్నారు. టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి సిటీ కేబుల్ అధినేత రావూరి రమేష్ బాబు, పారిశ్రామికవేత్త మన్నెం శ్రీనివాసరావు, రోటరీ 3150 గవర్నర్ రాంప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ , శ్రీమతి అనిత దంపతులు, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు ప్రెగడ రాజశేఖర్, టీడీపీ నాయకులు కొత్తపల్లి శ్రీనివాసరావు, పోతినేని మోహనరావు, వుడతా శ్రీనివాసరావు, నన్నూరి వెంకటేశ్వరరావు, గాజుల శ్రీనివాసరావు, రోటరీ ప్రతినిధులు, వడ్లమూడి బ్రదర్స్ తదితరులు వెంకయ్య చౌదరికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్