బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఆటోలకు డిజిటల్ నమోదు తప్పనిసరి

ఆటోలకు డిజిటల్ నమోదు తప్పనిసరి

రేపటి నుంచి మంగళగిరి సర్కిల్ కార్యాలయంలో ప్రక్రియ ప్రారంభం

ఆటోలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థ… రేపటి నుంచి అమలు

ప్రయాణికుల భద్రతకు డిజిటలైజేషన్ వైపు అడుగు

మంగళగిరి రూరల్ పోలీసుల కీలక నిర్ణయం

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఆటో డ్రైవర్లకు ప్రత్యేక నంబర్లు, డేటా నమోదు

మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్

మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి మండల పరిధిలోని ఆటో డ్రైవర్లకు డిజిటలైజేషన్ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. రాజధాని ప్రాంతంలో పెరుగుతున్న రాకపోకలు, ప్రజల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ వెల్లడించారు…మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 15 గ్రామాల్లో నడిచే ఆటోలకు ప్రత్యేక నంబర్లు కేటాయించి, క్యూఆర్ కోడ్ ద్వారా వారి వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమాచారం కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేయబడుతుందని చెప్పారు.ప్రాంతంలో యూనివర్సిటీలు, పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికుల భద్రత, ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఈ చర్యలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు…రేపటి నుంచి ఉదయం 10 గంటల నుండి మంగళగిరి సర్కిల్ కార్యాలయంలో నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ప్రతి ఆటో డ్రైవర్ తమ ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో హాజరై వివరాలు నమోదు చేసుకోవాలని ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ కోరారు.