బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసులో కీలక మలుపు.. భర్తకు బెయిల్ నిరాకరణ

డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసులో కీలక మలుపు.. భర్తకు బెయిల్ నిరాకరణ

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: బెంగళూరులో సంచలనం రేపిన డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్త మహేందర్ రెడ్డికి కోర్టు బెయిల్ నిరాకరించింది.విచారణ సందర్భంగా నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వాదించగా, కోర్టు ఆ వాదనను సమర్థిస్తూ బెయిల్‌ను తిరస్కరించింది. దీంతో మహేందర్ రెడ్డి జైలులోనే కొనసాగనున్నాడు.దర్యాప్తులో భాగంగా పోలీసులు సేకరించిన డిజిటల్ ఆధారాలు కేసును మరింత బలపరుస్తున్నాయి. నిందితుడు తన భార్య హత్యకు సంబంధించిన సందేశాలు పంపినట్లు గుర్తించినట్టు సమాచారం. ఇవి కీలక సాక్ష్యాలుగా మారనున్నాయి.పోలీసుల సమాచారం ప్రకారం, మహేందర్ రెడ్డి ప్రొపోఫాల్ అనే అనస్తీషియా మందును అధిక మోతాదులో ఇచ్చి హత్య చేసినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. అనంతరం ఈ ఘటనను సహజ మరణంగా చూపించే ప్రయత్నం చేసినట్టు భావిస్తున్నారు.ప్రస్తుతం పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తూ, మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో మరెవరైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ