బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుతో బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. మత్స్యకారుల సమస్యలపై చర్చ

సీఎం చంద్రబాబుతో బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. మత్స్యకారుల సమస్యలపై చర్చ

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక సమస్యలను ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.ఈ భేటీలో ముఖ్యంగా తీరప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. నెల్లూరు, ఒంగోలు, బాపట్ల జిల్లాల తీర ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాధవ్ వివరించారు. వారి జీవనోపాధి పూర్తిగా సముద్రంపై ఆధారపడినందున, చిన్న సమస్య కూడా తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.తమిళనాడుకు చెందిన మత్స్యకారులు స్పీడ్ బోట్లతో ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని, దీనివల్ల స్థానిక మత్స్యకారులకు నష్టం జరుగుతోందని ఆయన తెలిపారు. మత్స్య సంపదపై ఒత్తిడి పెరగడంతో పాటు స్థానికులకు వనరులు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్య కేవలం ఆర్థిక పరిమితిలో కాకుండా, శాంతిభద్రతల సమస్యగా మారుతోందని మాధవ్ పేర్కొన్నారు. సముద్రంలో తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేందుకు కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు.మాధవ్ సూచనలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కారం దిశగా ముందుకు సాగుతామని తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్