Breaking News

బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ గంగాభవాని కి శుభాకాంక్షలు..!

విజయవాడ. ఏప్రిల్ 9 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ గంగాభవాని 2026 ఎన్నికలలో గెలిచి న సందర్భంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, అసోసియే షన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అభినందన సభ గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో పలువురు వక్తలు గంగాభవాని సామాజిక రాజకీయ నిబద్దతలను ఆమె ఉత్తమ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్య క్షులు కేఎంఏ సుభాన్ మాట్లాడుతూ ఎన్.ఆర్.సి షాహిన్బాగ్ ఢిల్లీ రైతు ఉద్యమాలలో ఆమె పాత్ర ను కొనియాడారు. నేడు రాజ్యాంగ వ్యతిరేక అంశా లే తీర్పులుగా న్యాయస్థా నాలు వెలువరిస్తున్న నేప థ్యంలో గంగాభవాని గెలుపు ఒక ఆశాకిరణమ ని న్యాయస్థానాలలో రాజ్యాంగబద్ధ తీర్పులకు గంగాభవాని కృషి చేయా లని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ సి.ఆర్ రాష్ట్ర అధ్యక్షులు పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు మీడియా మీడియా వార్తలను కాక తామే నేర స్తులను గుర్తించడం పరి శోధించడం తీర్పులు ఇవ్వడం చివరికి తీర్పులు అమలు చేయడం కూడా చేస్తున్నాయని వార్తలను వార్తలు గాక న్యాయస్థా నాలుగా పనిచేస్తున్నాయ ని ఈ క్రమం నేర పరిశోధ నా సంస్థలను న్యాయస్థా నాలను కూడా ప్రభావిత పరిచే స్థాయికి చేరుకున్న యని, ఈ పరిస్థితి మారా లని అందుకు గంగాభవా ని తన పరిధిలో కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గంగాభవా ని మాట్లాడుతూ తన గెలుపు కోసం కృషి చేసిన అడ్వకేట్లకు, పార్టీలకు ప్రజా సంఘాల సంఘాల కు వ్యక్తులకు తన కుటుం బ సభ్యులకు విశేషంగా ధన్యవాదాలు తెలిపారు. తనకు లభించిన అవకా శం ద్వారా లాయర్ల సమ స్యలు ప్రత్యేకించి స్త్రీల సమస్యలపై మానవ హక్కులపై బాధ్యతాయు తంగా కృషి చేస్తానని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ రాంప్రసాద్, రెడ్డి, పార్టీ మహిళా నా యకులు కార్యకర్తలు తది తరులు పాల్గొన్నారు.

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

జగన్‌ మావిగన్‌ జోకర్‌: వైఎస్‌ షర్మిల సునాయాస వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *