బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలంటే చట్టసభల్లో వారికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గోవాలో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ పశ్చిమ ప్రాంత సదస్సులో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయ్యన్నపాత్రుడు ప్రతిపాదన ప్రకారం, 40 ఏళ్ల లోపు యువతకు చట్టసభల్లో కనీసం 33 శాతం సీట్లు రొటేషన్ పద్ధతిలో రిజర్వ్ చేయాలని సూచించారు. ఇది యువతను రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళడానికి దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రస్తుతం దేశంలో లోక్‌సభ సభ్యుల సగటు వయసు 56, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 53 సంవత్సరాలు ఉండటంతో యువతకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. విద్యార్థి రాజకీయాల్లో చురుకుదనం తగ్గడం, నాయకత్వం వచ్చిన హోదా కోసం అవకాశాల తగ్గుదల కూడా సమస్య అని స్పష్టం చేశారు.అయితే, సరైన అవకాశాలు కల్పిస్తే యువత తప్పకుండా రాజకీయాల్లో రాణిస్తారని అయ్యన్నపాత్రుడు భరోసా ఇచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్