Breaking News

వైద్య ఆరోగ్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.

కోదాడ, ఏప్రిల్ 10(నేటి తెలుగు పత్రిక): మండల పరిధిలోని నర్సింహా పురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజులపాటు జరిగే కార్యక్రమంలో భాగంగా ప్రజా పాలన_ ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో. అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ. ప్రజలు ప్రతి ఒక్కరూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని ఉచితంగా బీపీ షుగర్ మరియు ఇతర వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు ఇలాంటి పరీక్షలు ఉపయోగపడతాయని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం అందించేందుకు. అవసరమైన సదుపాయాలను సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తుందని. ముఖ్యంగా గ్రామాల్లో పల్లెలలో ఉన్న పేద ప్రజలు ఏదైనా అనారోగ్యం వస్తే ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లి. వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని. ఇకనుంచి ఎవరు కూడా. అలా ప్రైవేట్ హాస్పటల్ కు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యాన్ని ఉచితంగా పొందాలని. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాలలో అనుభవజ్ఞులైన డాక్టర్లు. అన్ని సదుపాయాలు ఉన్నాయని. కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 150 మందికి పైగా షుగర్ బిపి వివిధ పరీక్షల నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే ఇంతకుముందు. బిపి షుగర్ ఉన్న పేషంట్లకు అవసరమైన మందులను ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో. వార్డ్ సభ్యులు పచ్ఛిపాల అశ్విని రేవూరి కళ్యాణి బాబు. కేసగాని కామేశ్వరి వెంకన్న. పంచాయతీ కార్యదర్శి పచ్ఛిపాల వెంకటేశ్వర్లు. మునగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆకుపాముల AAM ఆశా కార్యకర్తలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యారణ్యపురిలో 8 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ.

ఇంటర్ ఫలితాలకు కౌంట్‌డౌన్.. 12న విడుదలకు సిద్ధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *