నగరాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తాం: మేయర్ కొలగాని శ్రీనివాస్.
కరీంనగర్, ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: నగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా శుక్రవారం నగరంలోని 3 వ డివిజన్ లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు. విద్యారణ్యపురి రోడ్డు నెంబర్ 1 లో స్థానిక కార్పోరేటర్ సాదవేణి లావణ్య, సుడా చైర్మన్ నరెంధర్ రెడ్డి తో కలిసి 8.70 లక్షల నిధులతో సీసీ రోడ్డు కు భూమీ పూజ చేసి పనులు ప్రారంభం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించి… సీసీ రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. సీసీ రోడ్డు నిర్మాణం కు శ్రీకారం చుట్టడం పట్ల స్థానిక డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ
నగర సమగ్ర అభివృద్ధే ద్యేయంగా మా పాలకవర్గం పని చేస్తుందని స్పష్టం చేశారు. విలీన గ్రామాల, శివారు ప్రాంతాల డివిజన్లను ప్రాధాన్యత గా తీస్కోని… నగరంతో సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా 3 వ డివిజన్ విద్యారణ్యపురి లో 8 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభం చేశామని తెలిపారు. నగర వ్యాప్తంగా కాలనీల్లో అంతర్గత రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్ది… ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. చేపట్టిన పనులను నాణ్యతతో గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికాకులను ఆదేశించినట్లు తెలిపారు. కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మా పాలకవర్గం ముందుకు సాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ గాజ రమ శివరాం, ఈఈ శివానందం, ఏఈ గఫూర్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మా పాలకవర్గంలో నగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా శుక్రవారం రోజు నగరంలోని 3 వ డివిజన్ లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు. విద్యారణ్యపురి రోడ్డు నెంబర్ 1 లో స్థానిక కార్పోరేటర్ సాదవేణి లావణ్య మునింధర్, సుడా చైర్మన్ నరెంధర్ రెడ్డి తో కలిసి 8.70 లక్షల నిధులతో సీసీ రోడ్డు కు భూమీ పూజ చేసి పనులు ప్రారంభం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించి… సీసీ రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. సీసీ రోడ్డు నిర్మాణం కు శ్రీకారం చుట్టడం పట్ల స్థానిక డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పనుల ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చిన మేయర్ కొలగాని శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించి… ధన్యవాదాలు తెలిపారు.
మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ
నగర సమగ్ర అభివృద్ధే ద్యేయంగా మా పాలకవర్గం పని చేస్తుందని స్పష్టం చేశారు. విలీన గ్రామాల, శివారు ప్రాంతాల డివిజన్లను ప్రాధాన్యత గా తీస్కోని… నగరంతో సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
