Breaking News

బీసీ ఉపకోటాపై పోరాటం కొనసాగుతుంది: కవిత స్పష్టం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కల్వకుంట్ల కవిత ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, బీసీ మహిళలకు ఉపకోటా సాధన కోసం జాగృతి ఉద్యమం మరింత తీవ్రం అవుతుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా లేకపోవడం అన్యాయమని విమర్శించారు.కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా ఉద్యమాలు చేపడతామని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీల నాయకులతో చర్చిస్తానని స్పష్టం చేశారు. ఉపకోటా అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.మహాత్మా పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ట్యాంక్‌బండ్ వద్ద విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటికీ పూర్తి కాలేదని, అంబేద్కర్ జయంతి నాటికైనా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.పూలే ఆశయాలను కొనసాగించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని, అదే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని కవిత పేర్కొన్నారు. అలాగే విద్యుత్ శాఖ ఆర్టిజన్ల సమస్యలపై కూడా స్పందిస్తూ, వారి పోరాటానికి జాగృతి మద్దతు ఉంటుందని తెలిపారు.

పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్

ములుగులో మంత్రి సీతక్క ఆగ్రహం.. తప్పుడు ప్రచారంపై హెచ్చరిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *