విజయవాడ. ఏప్రిల్ 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ మూఢన మ్మకాలు, వివక్షపై పోరాడి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో శనివా రం ఘనంగా నిర్వహిం చారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పూలే చిత్రపటానికి పూలమాల లు వేసి ఘన నివాళుల ర్పించారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఆనా డు ఎవరికీ అవగాహన లేని సమయంలోనే మహి ళలు, బీసీలకు జరుగుతు న్న అన్యాయాలపై గళమె త్తిన తొలి మహాత్ముడు పూలే అని కొనియాడారు. నందమూరి తారకరామా రావు బీసీ, బడుగు, బల హీన వర్గాల సంక్షేమం కోసం పూలే ఆశయాలకు అనుగుణం గానే తెలుగు దేశం పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు నేతృత్వం లో కూడా తెలుగుదేశం పార్టీ పూలే , ఎన్టీఆర్ స్ఫూర్తితో పేద, బడుగు వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు సాగుతోందన్నారు.బీసీలకు కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా, రాజ్యాధికారంలో సముచి త వాటా కల్పించి చట్టస భల్లో గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీయేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్న బీసీ నేత లే ఇందుకు నిదర్శ నం అన్నారు. కేంద్ర మం త్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్న పాత్రు డు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి గా ఉన్న పల్లా శ్రీనివాసరా వు వంటి వారు బీసీ నాయకులేనని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో బీసీలకు అత్యధికంగా మంత్రి పదవులు ఇచ్చి గౌరవిం చిన ఘనత కూడా పూలే ఆశయాలతో స్థాపించిన తెలుగుదేశం పార్టీకే దక్కు తుందని అన్నారు. పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాల ని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వ యిజరీ బోర్డు ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామ రాజు, టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాధం, మాజీ కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, చెన్ను పాటి ఉషారాణి , కొట్టేటి హనుమంతరావు, కాకు మల్లిఖార్జున యాదవ్, బీసీ నాయకులు టీఎన్ ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్, టీ ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.దర్షిత్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సొంగా సంజ య్ వర్మ, శాప్ డైరెక్టర్ ఎస్. సంతోష్, టిడిపి సీనియర్ నాయకులు కామా దేవరాజ్, చిట్టాబ త్తుని శ్రీనివాసరావు, నర సింహచౌదరి, డాక్టర్ సంకే విశ్వ నాధం, సోలంకి రాజు, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయ కులు ఇర్ఫాన్ తది తరులు పాల్గొన్నారు.
