బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఎండల తీవ్రత.. ఉదయం 11 గంటల వరకే స్కూల్స్ నిర్వహించాలని విజ్ఞప్తి

ఏపీలో ఎండల తీవ్రత.. ఉదయం 11 గంటల వరకే స్కూల్స్ నిర్వహించాలని విజ్ఞప్తి

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో పాఠశాలల పనివేళలను సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు చేరుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది.మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ ప్రకారం, పాఠశాలలను ఉదయం 11 గంటల వరకే నిర్వహించి ఒంటిపూట బడులుగా మార్చాలని సూచించారు. మధ్యాహ్నం తర్వాత తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ ప్రమాదం పెరుగుతుందని పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని చోట్ల ఒంటిపూట బడులు కొనసాగుతున్నప్పటికీ, 11 గంటల తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.ఇక ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ప్రకారం, వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఉండనున్నాయి. అయితే ఆలోపే తక్షణ చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్