బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సమ్మె హెచ్చరిక.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు కీలకం

ఆర్టీసీ కార్మికుల సమ్మె హెచ్చరిక.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు కీలకం

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమవుతున్నారు. వేతన సవరణలు, బెనిఫిట్స్, సర్వీస్ సంబంధిత సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ జేఏసీ డిమాండ్ చేస్తోంది.ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం లేబర్ కమిషనర్‌తో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చలు జరగనున్నాయి. చర్చల ఫలితాన్ని బట్టి సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని జేఏసీ నేతలు తెలిపారు.ఇప్పటికే ఈ నెల 20 నుంచి సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు హెచ్చరిక జారీ చేశాయి. గతంలో ఇచ్చిన నోటీసులకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని వారు పేర్కొంటున్నారు. ఈసారి కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమని తెలిపారు.అన్ని డిపోల కార్మికులు ఏకమవాలని జేఏసీ పిలుపునిచ్చింది. తమ హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.ఒకవేళ సమ్మె ప్రారంభమైతే ఆర్టీసీ సేవలు నిలిచిపోయే అవకాశం ఉండటంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి