బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఏసీ బస్సుల సౌకర్యం సిద్ధం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఏసీ బస్సుల సౌకర్యం సిద్ధం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుని దాదాపు 98 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి జూలై లేదా ఆగస్టులో విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ఏసీ బస్సులను ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విమానాశ్రయం ప్రారంభానికి ముందే రవాణా సదుపాయాలను బలోపేతం చేసి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం ఉత్తరాంధ్రకు గేమ్‌చేంజర్‌గా మారనుంది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ లభించడంతో పాటు వ్యాపారం, పర్యాటకం, పరిశ్రమల అభివృద్ధికి ఊతమిస్తుందని అధికారులు భావిస్తున్నారు.ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన చేతుల మీదుగా ప్రారంభమైతే ప్రాజెక్ట్‌కు మరింత ప్రాధాన్యం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.ఈ విమానాశ్రయం ద్వారా దేశీయ, అంతర్జాతీయ నగరాలకు నేరుగా విమాన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. దీని వల్ల ఐటీ, టూరిజం, ఎగుమతులు వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశముంది. అలాగే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ప్రభుత్వం పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, అన్ని భద్రతా మరియు సాంకేతిక ప్రమాణాలను పాటిస్తూ అత్యాధునిక సదుపాయాలతో విమానాశ్రయాన్ని సిద్ధం చేస్తోంది. ప్రారంభానికి ముందు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్