బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు

అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆక్రమాస్తుల కేసులో అరెస్టయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతికి ఏసీబీ కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు చేసింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఆమెను విచారించేందుకు ఏసీబీ అధికారులకు అనుమతి లభించింది.ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్న శాంతిని త్వరలోనే కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆస్తుల మూలాలు, ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల వివరాలపై లోతుగా దర్యాప్తు జరపనున్నారు. ఇంతకుముందు ఈ నెల 7న ఏసీబీ అధికారులు తాడేపల్లి, ఉండవల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో శాంతికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సుమారు 10 గంటలపాటు సాగిన ఈ సోదాల్లో కీలక ఆధారాలు లభించాయి.దర్యాప్తులో భాగంగా ఆమె ఆదాయానికి మించి సుమారు రూ.1.37 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. నగదు, బంగారం, స్థిరాస్తులు, పత్రాలు వంటి వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపించారు.ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత పెంపు, అవినీతి నిర్మూలన దిశగా చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్