Breaking News

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీని టార్గెట్ చేసిన మంత్రి సీతక్క.. కాంగ్రెస్ పాత్రను గుర్తుచేశారు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారి ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. మహిళల సాధికారత కోసం కాంగ్రెస్ హయాంలోనే ఈ బిల్లుకు పునాది వేసినట్లు పేర్కొన్నారు. అయితే బీజేపీ దీనిని కొత్తగా తీసుకొచ్చినట్లుగా ప్రచారం చేస్తోందని, ఇది ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని విమర్శించారు.బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ, ఆ పార్టీ చరిత్రలో ఇప్పటివరకు జాతీయ స్థాయిలో ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలిగా వ్యవహరించలేదని సీతక్క ప్రశ్నించారు. మహిళల గురించి మాట్లాడే ముందు తమ పార్టీలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని బీజేపీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.మహిళా రిజర్వేషన్‌ను ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఓట్ల రాజకీయాల కోసం మాత్రమే ఈ అంశాన్ని ముందుకు తెస్తున్నారని విమర్శించారు.అదే సమయంలో బీసీ మహిళలకు ప్రత్యేక కోటా తప్పనిసరిగా ఉండాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అణగారిన వర్గాల మహిళలకు న్యాయం జరగాలంటే సముచిత ప్రాతినిధ్యం అవసరమని పేర్కొన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను మహిళా రిజర్వేషన్‌తో కలపడం వల్ల అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాలను విడిగా చూడాల్సిన అవసరం ఉందని సూచించారు.మహిళల సాధికారత కోసం చట్టాలు మాత్రమే కాకుండా వాటి అమలు కూడా కీలకమని మంత్రి సీతక్క అన్నారు. ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని ఆమె స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆనందం.. ఈటెలకు కార్పొరేటర్ల కృతజ్ఞతలు

స్టాండప్ కామెడీ వివాదం.. అనుదీప్ కటికలపై చర్యలకు ఆదేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *