బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కీసరలో అంబేద్కర్ జయంతి వేడుకలు.. విగ్రహానికి ఎంపీ ఈటల రాజేందర్ ఘన నివాళి

కీసరలో అంబేద్కర్ జయంతి వేడుకలు.. విగ్రహానికి ఎంపీ ఈటల రాజేందర్ ఘన నివాళి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: కీసరలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కులం, మతం, పార్టీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు.సమాజంలో సమానత్వం, న్యాయం సాధించేందుకు అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పన ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు లభించాయని చెప్పారు.అంబేద్కర్‌ను ఒక వర్గానికి పరిమితం చేసే ప్రయత్నాలు జరిగాయని, కానీ ఆయన జీవితాంతం అణగారిన వర్గాల కోసం పోరాడిన నాయకుడని ఈటల రాజేందర్ అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

అంబేద్కర్ సేవలు దేశ అభివృద్ధికి మార్గదర్శకమని, ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి