బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

‘నారీ శక్తి వందన్’ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నేతలకు చంద్రబాబు పిలుపు.. 2029 నుంచి 33% మహిళా రిజర్వేషన్లు లక్ష్యం

‘నారీ శక్తి వందన్’ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నేతలకు చంద్రబాబు పిలుపు.. 2029 నుంచి 33% మహిళా రిజర్వేషన్లు లక్ష్యం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాజ్యసభ మరియు లోక్‌సభ ఎంపీలకు లేఖ రాశారు.ఈ లేఖలో 2029 ఎన్నికల నుంచి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసే లక్ష్యంతో తీసుకువస్తున్న ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళల సాధికారత దేశ అభివృద్ధికి కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించాలనే సంకల్పాన్ని బలపరచాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఈ బిల్లు మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడంలో చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ నెల 16న పార్లమెంట్‌లో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇది దేశ ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లు అమలు కావడం సమానత్వం, సామాజిక న్యాయం దిశగా పెద్ద అడుగుగా నిలుస్తుందని తెలిపారు.ప్రభుత్వం, పరిపాలన, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు నాయుడు అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆయన లేఖలో స్పష్టం చేశారు.భారతదేశం మహిళా శక్తిని గౌరవించే దేశంగా నిలవాలని, అందుకే ఈ బిల్లుకు అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్