బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మహిళా రిజర్వేషన్‌కు బీఆర్‌ఎస్ గ్రీన్ సిగ్నల్

మహిళా రిజర్వేషన్‌కు బీఆర్‌ఎస్ గ్రీన్ సిగ్నల్

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో కేటీఆర్, హరీష్ రావుతో కలిసి జాతీయ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్‌ఎస్ తన మద్దతును స్పష్టంగా ప్రకటించింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం సమాజానికి అవసరమని, ఇది మహిళల సాధికారతకు దోహదపడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాత్రం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే అభివృద్ధి దిశగా ముందున్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకూడదని స్పష్టం చేశారు. లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల వాటాను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కేసీఆర్ గట్టిగా చెప్పారు.అలాగే పార్టీ బలోపేతంపై కూడా చర్చ జరిగింది. రాబోయే రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని నాయకత్వం నిర్ణయించింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి