బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతి ఓఆర్‌ఆర్‌కు గ్రీన్ సిగ్నల్.. స్టే పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

అమరావతి ఓఆర్‌ఆర్‌కు గ్రీన్ సిగ్నల్.. స్టే పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రాజెక్టును నిలిపివేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరిస్తూ, ఈ దశలో అభివృద్ధి పనులను ఆపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన రైతు కన్నిగంటి ఆంజనేయ ప్రసాద్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్ కారణంగా తన భూమికి నష్టం జరుగుతుందని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.విచారణలో పిటిషనర్ వాదనలు విన్న కోర్టు, ప్రాజెక్టును అడ్డుకునేలా తగిన ఆధారాలు లేవని అభిప్రాయపడింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం పేరుతో వ్యక్తిగత ప్రయోజనాలు సాధించాలనే ఉద్దేశ్యం ఉన్నదేమో అన్న సందేహాన్ని కూడా వ్యక్తం చేసింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని, పెట్టుబడులు పెరిగే అవకాశముందని కోర్టుకు తెలిపారు.ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ప్రాజెక్టును నిలిపివేయడం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని పేర్కొంది. అభివృద్ధి కార్యక్రమాలను ఆపడం కంటే, పిటిషనర్ వ్యక్తిగత సమస్యలను వేరుగా పరిష్కరించుకోవాలని సూచించింది.ఈ నేపథ్యంలో అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు పనులు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ తీర్పుతో రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముందడుగు పడినట్లయింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్