బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జ్యూస్ ముసుగులో విషప్రయోగం.. చిన్నారిపై చిన్నమ్మ దారుణం

జ్యూస్ ముసుగులో విషప్రయోగం.. చిన్నారిపై చిన్నమ్మ దారుణం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన బయటపడింది. కుటుంబ కలహాలు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తాయో చూపించేలా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై అమానుష ఘటన చోటుచేసుకుంది. జ్యూస్ అని నమ్మించి యాసిడ్ తాగించడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది.బోడుప్పల్‌కు చెందిన నాగరాజు, సంధ్య దంపతుల కుమారుడు కార్తీక్ వాసు (4) ఈ దారుణానికి బలయ్యాడు. ఈ నెల 9న నాగరాజు సోదరుడి భార్య మంజుల, బాలుడిని మోసం చేసి జ్యూస్ పేరుతో యాసిడ్ తాగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కుటుంబంలో ప్రేమాభిమానాల విషయంలో ఉన్న అసూయ కారణంగానే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా బాలుడిపై ఎక్కువ ఆదరణ ఉండటాన్ని భరించలేక ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో కూడా బాలుడిపై హానిచేయడానికి ప్రయత్నించినట్లు బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి