బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అంబటి అనుదీప్ హత్య కేసులో వేగవంతమైన విచారణకు డిమాండ్: రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

అంబటి అనుదీప్ హత్య కేసులో వేగవంతమైన విచారణకు డిమాండ్: రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: అంబటి అనుదీప్ హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ డిమాండ్ చేశారు. ఈ కేసుకు విచారణ అధికారిగా నియమితులైన పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌ను శుక్రవారం ఏలూరులోని వారి కార్యాలయంలో కలిసి, కేసు పురోగతిపై చర్చించారు.ఈ సందర్భంగా చందు జనార్దన్ మాట్లాడుతూ, హత్యకు ముందు అనుదీప్‌ను బెదిరించిన వ్యక్తులను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు కేసులో అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చినప్పటికీ, వాటిపై స్పష్టత రాకపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.దర్యాప్తు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఇక ఈ కేసుపై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు ఆదివారం సాయంత్రం చట్రాయ్‌లోని అంబటి అనుదీప్ నివాసంలో సమావేశం నిర్వహించనున్నట్లు చందు జనార్దన్ ప్రకటించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ముందడుగు చర్యలపై చర్చించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తుమ్మల జగన్, అనుదీప్ తండ్రి అంబటి గోపి, జేఏసీ నేతలు ఏవి శ్రీనివాస్, జగదీష్, కడవకొల్లు సాగర్, శ్రీనివాస్‌తో పాటు స్థానిక యువ నాయకులు పాల్గొన్నారు.అంబటి అనుదీప్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, బాధిత కుటుంబానికి న్యాయం ఎప్పుడు జరుగుతుందన్న ప్రశ్నలు మరింతగా వినిపిస్తున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్