Breaking News

ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు.. రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన అవార్డు

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి కుమార్తె అన్షు మాలిక అంతర్జాతీయ స్థాయిలో మరో గొప్ప గుర్తింపును సొంతం చేసుకుంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇండియానా యూనివర్సిటీ అందించే హెర్మన్ బి. వెల్స్ అవార్డుకు ఆమె ఎంపిక కావడం విశేషం. ప్రతి ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఒక్క విద్యార్థికే ఈ అవార్డు అందించడం జరుగుతుండటంతో, అన్షు సాధించిన ఈ ఘనత ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ సందర్భంగా రోజా సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. కూతురి కృషి, అంకితభావం, ధైర్యం ఈ విజయానికి కారణమని పేర్కొంటూ, ఇది ఆమె ప్రయాణంలో మొదటి అడుగే అని భావోద్వేగంగా తెలిపారు. ప్రస్తుతం ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అన్షుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.1961 నుంచి ఇండియానా యూనివర్సిటీ ఈ అవార్డును ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవలో చురుకుదనం ఆధారంగా అందిస్తోంది. ప్రస్తుతం అదే విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో చదువుకుంటున్న అన్షు, చదువుతో పాటు కోడింగ్, వెబ్ డెవలప్‌మెంట్ రంగాల్లో ప్రతిభ కనబరుస్తోంది. అదేవిధంగా ‘ఆర్ట్ ఫర్ ఎ కాజ్’ వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక సేవలోనూ చురుగ్గా పాల్గొంటోంది.చిన్నప్పటి నుంచే బహుముఖ ప్రజ్ఞ కలిగిన అన్షు, రచయిత్రిగా కూడా తన ప్రతిభను చాటుకుంది. ఇప్పటికే పలు పుస్తకాలు రచించడంతో పాటు అంతర్జాతీయ వేదికలపై ర్యాంప్ వాక్‌లలో కూడా పాల్గొంది. భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆమె విజయాలు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

ప్రకాశ్‌రాజ్‌పై పరువు నష్టం కేసు

వివాహానికి చంద్రబాబును ఆహ్వానించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *