బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

తమిళనాడులో విషాదం.. బాణసంచా కర్మాగారంలో పేలుడు, 18 మంది మృతి

తమిళనాడులో విషాదం.. బాణసంచా కర్మాగారంలో పేలుడు, 18 మంది మృతి

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడుతో 18 మంది కార్మికులు దుర్మరణం చెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.ఆదివారం ఉదయం పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో కట్టనార్‌పట్టి ప్రాంతంలోని ప్రైవేటు బాణసంచా కర్మాగారంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు కొన్ని సెకన్లలోనే నాలుగు భవనాలు కూలిపోయాయి. పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.పేలుడు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కర్మాగారం యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విరుదునగర్ ప్రాంతంలో బాణసంచా పరిశ్రమపై వేలాది కుటుంబాలు ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ