బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జాగృతి వేదికగా రాథోడ్ బాపురావుకు స్వాగతం

జాగృతి వేదికగా రాథోడ్ బాపురావుకు స్వాగతం

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును జాగృతిలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆయనకు కండువా కప్పి పార్టీ తరఫున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి నాయకులు కొత్త రాజకీయ వేదిక వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన కార్యకర్తలు మళ్లీ ఒకటై రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాను నిర్వహించిన హెల్త్ క్యాంపులను గుర్తుచేసుకుంటూ, రాథోడ్ బాపురావు ఉద్యమానికి చేసిన సేవలను ప్రశంసించారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉందని పేర్కొన్నారు. కొత్త పార్టీకి ఆదిలాబాద్ ప్రాంతంలో మంచి స్పందన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.రాథోడ్ బాపురావు మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల్లో పనిచేశానన్నారు. కవిత ఇచ్చిన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తరువాత ప్రాధాన్యం దక్కలేదని చెప్పారు.ఇకపై కవిత నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని, త్వరలో ఇచ్చోడలో భారీ సభ ఏర్పాటు చేసి కార్యకర్తలను పార్టీలో చేర్పిస్తానని వెల్లడించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి