బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్‌పై ఘోర ప్రమాదం.. కారుతో ఢీకొని యువకుడు మృతి

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్‌పై ఘోర ప్రమాదం.. కారుతో ఢీకొని యువకుడు మృతి

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా మరో ప్రాణం బలైంది. మాదాపూర్ పరిధిలోని కేబుల్ బ్రిడ్జ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉదయం వెలుగులోకి వచ్చింది.పోలీసుల సమాచారం ప్రకారం, గోస శ్యామ్ రాజ్ (32) అనే యువకుడు సోమవారం తెల్లవారుజామున బ్రిడ్జ్‌పై నిలబడి ఉండగా, జూబ్లీ హిల్స్ వైపు నుంచి అతివేగంగా వస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు అతడిని ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే కారు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్యామ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వాహనాన్ని గుర్తించిన పోలీసులు, పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలో వేగవంతమైన డ్రైవింగ్‌పై కట్టడి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి