బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఎమ్మిగనూరులో ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు రట్టు.. లక్షల్లో నగదు స్వాధీనం

ఎమ్మిగనూరులో ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు రట్టు.. లక్షల్లో నగదు స్వాధీనం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రహస్యంగా సాగుతున్న భారీ ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. స్పెషల్ బ్రాంచ్ నుంచి అందిన విశ్వసనీయ సమాచారంతో డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో పోలీసులు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో సమన్వయంతో దాడులు నిర్వహించారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా ఆరుగురు సభ్యులతో కూడిన ముఠాను గుర్తించిన పోలీసులు, అందులో నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.నిందితుల వద్ద నుంచి సుమారు రూ.22 లక్షల నగదు, నాలుగు అధిక విలువైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ ముఠా ‘డెక్కన్ 247’ పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించి, ఐపీఎల్ మ్యాచ్‌లపై ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తేలింది. వినియోగదారులకు ప్రత్యేక లాగిన్ ఐడీలు అందించి, సిస్టమేటిక్‌గా పందేలు నిర్వహించేలా సెట్‌ప్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తక్కువ సమయంలో అధిక లాభాల ఆశతో ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఒకసారి నేర కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు వంటి అవకాశాలు దెబ్బతింటాయని చెప్పారు.అక్రమ బెట్టింగ్‌పై ఎక్కడైనా సమాచారం లభిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారదాత వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్