బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

వేసవి వేడిలో చలివేంద్రం.. ప్రజల దాహం తీర్చే సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

వేసవి వేడిలో చలివేంద్రం.. ప్రజల దాహం తీర్చే సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కోదాడ ,ఏప్రిల్ 20(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణంలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రం అభినందనీయమని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండుతున్న ఎండల్లో ప్రజలకు చల్లని తాగునీరు అందించడం ఎంతో గొప్ప సేవ అని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో సేవా భావాన్ని పెంపొందిస్తాయని, ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలు, ప్రయాణికులు వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఉపశమనం కలిగించే ఈ చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.ప్రజల ఆరోగ్యం దృష్ట్యా శుభ్రమైన తాగునీరు అందించడం చాలా అవసరమని, సేవా కార్యక్రమాలు చేపట్టిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చలివేంద్రo నిర్వాహకులు సంపేట సుధాకర్ గౌడ్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవల్లి బాల్రెడ్డి, సంపేట రవి గౌడ్, తుమాటి నాగిరెడ్డి, సుందరి వెంకటేశ్వర్లు, ప్రసాద్ రెడ్డి, పశ్య నవీన్ రెడ్డి, ఒంటి పులి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి