మచిలీపట్నం, ఏప్రిల్ 20(నేటి తెలుగు పత్రిక ): జిల్లా పంచాయతీ కార్యాలయం లో ఉన్నతాధికారి సీటు ఇన్చార్జిగా దక్కించుకోవడం కోసం అసత్య ప్రచారాలతో అవినీతి మరకలు అంటిస్తు కట్టుకథలతో విషప్రచారం చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లాలోని పలువురు పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేసే ఒకరిద్దరు సీనియర్లు గ్రూపు రాజకీయాలు తో జిల్లా పంచాయతీ కార్యాలయాన్ని అల్లరి పాలు చేస్తున్నారని ఆరోపణలు సర్వత్ర వి నవస్తున్నాయి. దీనిపై తక్షణమే డిపిఓ డాక్టర్ జె.అరుణ స్పందించాలని సోమవారం కోరారు.కృష్ణా జిల్లా డీపీవో కార్యాలయం… బయట వినిపిస్తున్న కట్టు కథలు ఉద్యోగుల్లో అయోమయo నెలకొందని తెలుస్తుంది. కట్టు కథలు — నిజాలు !
డీపీవో కుర్చీ కోసం నడుస్తున్న విష ప్రచారం !
ఇటీవల కృష్ణా జిల్లా డీపీవో కార్యాలయం పై వస్తున్న ప్రసార మాధ్యమాలలో వరుస కథనాల నేపథ్యంలో నేటి తెలుగు పత్రిక దృష్టి సారించింది.కార్యాలయంపై కట్టుకథలు వినిపిస్తున్నది నిజమా? లేక ఎవరో పథకం చేసి ప్రచారంచేస్తున్న విష ప్రచారమా అనేదానిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.కార్యాలయం లోపల అధికార దాహన్ని * ప్రధాన అధికారికి అంటించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. దీనికి ప్రధాన సూత్రధారి పాత్రధారిగాకృష్ణా జిల్లా పంచాయతీ కార్యాలయంలోని ఒక సీనియర్ అధికారి వర్గం మరియు కలెక్టరేట్లోని కొంతమంది అధికారులకు పదవులపై పెరిగిన పదవీ వ్యామోహం, ఆసక్తి, అంతర్గత పోటీలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంచార్జి డీపీవో గా పని చేస్తున్న సీఈఓ జడ్పీ పై వస్తున్న ఆరోపణల వెనుక కూడా ఇదే కోణం దాగిఉందన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది.
పదోన్నతుల గేమ్ ఎక్కడ స్టార్ట్ అయింది?
పంచాయతీ రాజ్ శాఖ పునర్వ్యవస్థీకరణతో పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగావేగంగా సాగుతున్న సమయంలో కార్యాలయంలోని ఒక సీనియర్ అధికారి
వర్గం ఈ ప్రక్రియను కాస్త నెమ్మదింపజేయాలని కుదిరితే ఆగేలా చూడాలని విశ్వ ప్రయత్నాలు చేశాయన్న టాక్ అప్పట్లో బాగా నడిచింది.అదే కార్యాలయంలోని మరో సీనియర్ అధికారి వర్గం” ఈ ప్రక్రియను, డీపీవో పదోన్నతి పై వెళ్లేంత వరకు నిలిపివేసి, తర్వాత తమకు అనుకూలంగా ఉద్యోగుల పదోన్నతుల ఫైళ్లను నడిపించి లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఇలా వ్యవహరించిందన్న చర్చలు గతంలో బలంగా వినిపించాయి.
కానీ సీన్ ట్విస్ట్ ఏంటంటే…
పదోన్నతి జాబితాలో ఉన్న ఉద్యోగులు నేరుగా జిల్లా కలెక్టర్ బాలాజీని ని కలిసి విషయం మొత్తం చెప్పడంతో, మొత్తం వ్యవహారం కీలకమలుపు తిరిగింది. ఈ నేపథ్యంలోతుదిగా ఎన్ని అడ్డంకులు సృష్టించిన పారదర్శకత్వంతో పదోన్నతులు డిపిఓ ముందుకు సాగించారు. అవినీతి రాక్షసులు చలామణి అవుతున్న వారు గండి కొట్టే ప్రయత్నాలు గాని,ఎలాంటి ఒత్తిడులు పనిచేయలేదు.అర్హులైన వారందరికీ పారదర్శకంగా ప్రమోషన్లు అందా యి.పని పట్ల నిబద్ధతతో ముందుకు వెళ్తున్న అధికారిని కొందరి వ్యక్తిగత ఆశలు, పదవి కోరికలు కోసం టార్గెట్ చేస్తూ బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగాచర్చ నడుస్తోంది. అసత్య ప్రచారాలకు బలి కాకండి — నిజాలు తెలుసుకుని స్పందించండి అంటూ ఉద్యోగులు బాహాటంగా ముకుమ్మడి ముందుకు వచ్చి జిల్లా ముఖ్య అధికారికి అండగా నిలబడటం అవినీతి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అనేది జగమెరిగిన సత్యం గా మారింది. జిల్లా పంచాయతీ కార్యదర్శుల విజ్ఞప్తి మేరకు అవినీతి పరులను చీల్చి చండాడాలని జిల్లా ప్రజలు కూడా డిపిఓకి విజ్ఞప్తి చేస్తున్నారు.
