బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వంఅంగన్వాడీల ద్వారా అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి,: సూపర్వైజర్ టి.అనిత

ప్రభుత్వంఅంగన్వాడీల ద్వారా అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి,: సూపర్వైజర్ టి.అనిత

పామర్రు, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆరోగ్యవంతమైన సమాజ సాధన కోసంఅంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భవతులు, బాలింతలు, చిన్నారులకుఅందించే బాలామృతం, గుడ్లు, మరియు పాలను సద్వినియోగం చేసుకోవాలని పామర్రు ఐసిడిఎస్ ప్రాజెక్టు సెక్టార్ సూపర్వైజర్ టి.అనిత కోరారు. నియోజవర్గం పరిధిలోని పమిడి ముక్కల మండలం కపిలేశ్వరపురం సెక్టార్ పరిధిలోని మంటాడ -5అంగన్వాడి కేంద్రంలో మంగళవారం పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అనిత మాట్లాడుతూ, రక్తహీనత లేని ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు గ్రామంలోని అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. సాంప్రదాయ మరియు స్థానిక ఆహార అలవాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని,పోషణ్ పక్వాడ అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పిoచారు. చిన్నారులను జింక్ ఫుడ్ కు దూరంగా ఉంచుతూ పోషకారాన్ని అందించాలని సూచించారు.పోషణ్‌ పక్వాడా కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల ప్రయోజనాలు, వినియోగంపై అవగాహన కల్పించారు. ఏఎన్ఎం కె.లక్ష్మి మాట్లాడుతూ, గర్భిణులు ప్రతి నెలా మొదటి వారoతొమ్మిది తేదిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సరైన ఆహారం, బరువు పెరగడం మరియు రక్తహీనత నివారణపై లక్ష్మి అవగాహన కల్పించారు.బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలని ఆమె చెప్పారు. 7వ నెల నుండి అనుబంధ పోషకాహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సంబంధిత అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు ఎస్. రాజేశ్వరి, జె. శివరత్నం, టి. అరుణ కుమారి, జి. కృష్ణవేణి,బి. వెంకట కుమారి, ఆశా కార్యకర్త డి.నారాయణమ్మ, పలువురు గర్భవతులు బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్