బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వైజర్ సీతాశర్మ రాజీనామా ఆమోదం

స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వైజర్ సీతాశర్మ రాజీనామా ఆమోదం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్‌గా పనిచేస్తున్న సీతాశర్మ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ఆమె పదవీకాలం పూర్తికాకముందే వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.మార్చి 5న ఆమె తన రాజీనామా లేఖను సమర్పించగా, నిర్వాహక మరియు వ్యవస్థాగత సమస్యలు తన పనితీరుకు అడ్డంకిగా మారినట్లు పేర్కొన్నారు. ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నానని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మార్చి 7 నుంచి అమల్లోకి వచ్చేలా రాజీనామాను ఆమోదిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్కిల్ డెవలప్‌మెంట్ విభాగంలో ఖాళీ ఏర్పడింది.సీతాశర్మ తన పదవీకాలంలో యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించడం, విదేశీ ఉపాధి అవకాశాలు పెంపొందించడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. అయితే పరిపాలనా అడ్డంకులు ఈ ప్రణాళికల అమలును ప్రభావితం చేసినట్లు సమాచారం.ఇక ఈ పరిణామంతో శాఖ భవిష్యత్ దిశపై చర్చలు జరుగుతున్నాయి. కొత్త నియామకం త్వరలో చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్