బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ పాత్ర అమోఘం: బండి సంజయ్

దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ పాత్ర అమోఘం: బండి సంజయ్

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కీలక భూమిక పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. నక్సలిజం, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ సీఆర్పీఎఫ్ జవాన్లు చూపుతున్న ధైర్యసాహసాలు ప్రశంసనీయం అన్నారు.హర్యానాలోని గురుగ్రాం సీఆర్పీఎఫ్ అకాడమీలో నిర్వహించిన 56వ బ్యాచ్ గెజిటెడ్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అమర వీరులకు నివాళులర్పించి, పరేడ్‌ను పరిశీలించారు.52 వారాల కఠిన శిక్షణ అనంతరం విధులకు సిద్ధమైన యువ అధికారుల నిబద్ధత దేశానికి గర్వకారణమని బండి సంజయ్ అన్నారు. దేశసేవ అనే పవిత్ర లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. దేశానికి సేవ చేయడం కంటే గొప్ప బాధ్యత మరొకటి లేదని ఆయన స్పష్టం చేశారుసీఆర్పీఎఫ్ దేశంలో అతిపెద్ద సాయుధ పోలీస్ దళంగా నిలిచి, అంతర్గత భద్రతను కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. 1939లో స్థాపించబడిన ఈ దళం అప్పటి నుంచి నిరంతరం సేవలందిస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటోందని తెలిపారు.‘సేవ, నిష్ఠ’ అనే ఆదర్శంతో పనిచేస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు భవిష్యత్తులో కూడా దేశ భద్రత కోసం మరింత సమర్థంగా సేవలందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి