బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆర్టీసీ సమ్మె విరమించండి: మంత్రి సీతక్క విజ్ఞప్తి

ఆర్టీసీ సమ్మె విరమించండి: మంత్రి సీతక్క విజ్ఞప్తి

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మంత్రి సీతక్క కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నామని, సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని ఆమె కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.సమ్మె సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదని పేర్కొన్న సీతక్క, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఈ క్రమంలో కార్మికులు లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ నాలుగు వారాల్లో నివేదిక సమర్పించనుందని వెల్లడించారు. కార్మికుల ప్రధాన డిమాండ్లైన ప్రభుత్వంలో విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఈ అంశాలపై అన్ని వర్గాలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.ఇది కాలయాపన కాదని, సమగ్ర పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలేనని సీతక్క స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు.అదేవిధంగా, ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీకి జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలను క్లియర్ చేయడంతో పాటు, పీఎఫ్, సీసీఎస్ బకాయిలను కూడా తగ్గించినట్లు వివరించారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమ్మెను విరమించాలని మంత్రి సీతక్క మరోసారి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి