బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

చర్లపల్లి పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం – లక్ష్మారెడ్డి

చర్లపల్లి పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం – లక్ష్మారెడ్డి

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామికవాడ అభివృద్ధిపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ప్రాంత అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చర్లపల్లి పారిశ్రామికవాడను సమగ్రంగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ద్వారా పరిశ్రమల అభివృద్ధిని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.చర్లపల్లి రైల్వే స్టేషన్ విస్తరణతో ఈ ప్రాంతంలో రద్దీ పెరిగిందని, దీనితో రవాణా సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ముఖ్యంగా కార్మికులు, ఉద్యోగుల రాకపోకలు సులభంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.సమావేశంలో పారిశ్రామికవేత్తలు రహదారి విస్తరణ, డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. చక్రీపురం నుంచి గణేష్ టెంపుల్ కమాన్ వరకు రోడ్డు విస్తరణ అత్యవసరమని, ప్రస్తుత ట్రాఫిక్ సమస్యలు పరిశ్రమల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు. అలాగే వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయని తెలిపారు.ఈ సమస్యలపై స్పందించిన లక్ష్మారెడ్డి, సంబంధిత శాఖలతో చర్చించి దశలవారీగా పరిష్కారం తీసుకువస్తామని చెప్పారు. రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడించారు.పారిశ్రామికవాడల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడితే పరిశ్రమల వృద్ధి వేగవంతమవుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి