Breaking News

క్రీడా అకాడమీలు, సమ్మర్ క్యాంప్, క్రీడా మౌలిక వసతులు పై సమీక్ష…!

విజయవాడ. ఏప్రిల్ 22 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: క్రీడా మౌలిక సదుపాయాలు, క్రీడా అకాడమీలు, శాప్ లీగ్స్, సమ్మర్ క్యాంపులు, క్రీడా యాప్‌పై ఉన్నతాధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ శాప్ ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించను న్న సమ్మర్ క్యాంపులను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారు లను ఆదేశించారు. క్యాంపుల నిర్వహణలోస్కూల్ గేమ్స్ విభాగం, మున్సిపా లిటీలు, అర్బన్ డెవలప్మెంట్ శాఖలతో సమన్వయం పెంపొందించి, పిల్లలకు మెరుగైన క్రీడా వాతా వరణం కల్పించాలని సూచించారు. ప్రతి జిల్లా లో సమ్మర్ క్యాంపుల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పర్యవేక్షణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న శాప్ లీగ్స్‌ను క్రీడాకారులకు ప్రతిభ చాటుకునే వేదికగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ లీగ్స్ నిర్వహ ణలో జిల్లా యంత్రాంగం, స్థానిక క్రీడా సంఘాలు, విద్యాసంస్థలతో సమన్వయం చేసుకొని పారదర్శ కంగా, విజయ వంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. త్వరలో పునఃప్రారంభంకానున్న క్రీడా అకాడమీల పై కూడా చైర్మన్ ప్రత్యేక దృష్టి సారించారు. అకాడమీల కు క్రీడాకారుల ఎంపి క ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభా వంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలని తెలిపారు. అకాడమీలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణా పరికరాలు, నిపుణులైన కోచ్‌ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న క్రీడా వికాస కేంద్రాల పురోగతి పై సమీ క్ష నిర్వహించారు. క్రీడా మౌలిక వసతుల నిర్మాణంలో నాణ్యతకు అత్యం త ప్రాధాన్యం ఇవ్వాలని, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తు లో రాష్ట్రాన్ని క్రీడా రంగంలో అగ్రగామి గా నిలబెట్టే విధంగా దీర్ఘ కాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. క్రీడా యాప్ అమలుపై కూడా సమావే శంలో చర్చ జరిగింది. రాష్ట్రంలోని యువతకు క్రీడా సమాచారం, నమో దు ప్రక్రియలు, శిక్షణ అవ కాశాలు, పోటీ వివరాలు సులభంగా అందుబాటు లోకి తీసుకు రావడానికి యాప్‌ను మరింత సమర్థ వంతంగా అభివృద్ధి చేయాలని చైర్మన్ సూచిం చారు. ఈ కార్యక్రమంలో శాప్ ఎండీ భరణి IFS, పరిపాలన అధికారి వెంక టరమావత్ నాయక్, ఇత ర క్రీడా అధికారులు తది తరులు పాల్గొన్నారు.

పిఠాపురం ప్రొటోకాల్ వివాదం.. నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం: ఎమ్మెల్యే పరిటాల సునీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *