బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు: రాంచందర్ రావు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు: రాంచందర్ రావు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి రాజకీయంగా వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు.హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని అన్నారు. కార్మికుల పక్షాన ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. గతంలో పీఆర్సీ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హామీ ఇచ్చి అమలు చేయలేదని గుర్తు చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరి వైఖరిలో పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు.ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు కార్మికులకు అండగా ఉంటారని తెలిపారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే బీజేపీ తరఫున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రేపు ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి