బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: నారాయణ

డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: నారాయణ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): చిత్తూరు జిల్లా నగరిలో సీపీఐ నేత నారాయణ డీలిమిటేషన్ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల స్థానాల సంఖ్య పెరిగినా, అభివృద్ధి క్షీణించే ప్రమాదం ఉందని అన్నారు.రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉన్న ఈ అంశాన్ని సీనియర్ నాయకులు సరిగా అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యకరమని విమర్శించారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా మొత్తం దక్షిణ భారతానికి నష్టం కలిగించే చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ నాయకత్వం దక్షిణాదిలో విజయం సాధించడం కష్టమని భావించి, మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ముందుకు తెస్తోందని నారాయణ ఆరోపించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మెజారిటీ సాధించి పార్లమెంట్‌లో తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర విధానాలకు కొందరు రాష్ట్ర నాయకులు మద్దతు ఇవ్వడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్