బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మహిళా రిజర్వేషన్‌పై ‘మహిళా ఆగ్రహ యాత్ర’.. వినాయకనగర్‌లో బీజేపీ నిరసన

మహిళా రిజర్వేషన్‌పై ‘మహిళా ఆగ్రహ యాత్ర’.. వినాయకనగర్‌లో బీజేపీ నిరసన

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మహిళా రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాల వైఖరిని నిరసిస్తూ వినాయకనగర్ డివిజన్‌లో ‘మహిళా ఆగ్రహ యాత్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి నాయకత్వంలో నిర్వహించిన ఈ యాత్రలో మహిళలు భారీగా తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై మహిళలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. మహిళల సాధికారతకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రిజర్వేషన్ బిల్లుతో మహిళల అభివృద్ధికి దారి తీసిందని పేర్కొన్నారు.మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, మహిళల హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందని, దీనికి వ్యతిరేకంగానే ఈ ఆగ్రహ యాత్ర చేపట్టామని తెలిపారు.ఈ యాత్రలో పాల్గొన్న మహిళలు నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు. కార్యక్రమం విజయవంతం కావడంతో నాయకులు మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి