బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

28న పోలవరం నిర్వాసితులకు భూపట్టాలు, పరిహారం పంపిణీ: మంత్రి నిమ్మల రామానాయుడు

28న పోలవరం నిర్వాసితులకు భూపట్టాలు, పరిహారం పంపిణీ: మంత్రి నిమ్మల రామానాయుడు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నెల 28న భూపట్టాలు మరియు నగదు పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో ఉన్న నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలను పూర్తిచేయాలని జలవనరుల శాఖకు సూచనలు జారీ అయ్యాయి. ఇప్పటికే పలు దఫాల్లో పండుగల సందర్భాల్లో నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరొక కీలక దశను ప్రారంభిస్తోంది.ఏలూరు జిల్లా కేఆర్‌పురం ఫేజ్-1బీ పునరావాస ప్రాజెక్ట్ కింద ఈ పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహించనున్నారు. మొత్తం 14 గ్రామాలకు చెందిన 1,241 నిర్వాసిత కుటుంబాలకు రూ.85.03 కోట్ల పరిహారం చెక్కులు మరియు ఇంటి స్థల భూపట్టాలు అందజేయనున్నారు.పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, నిర్వాసితులకు అన్ని విధాలుగా సహాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ కార్యక్రమంతో పునరావాస ప్రక్రియలో మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్