బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కవిత పార్టీ పేరులో ‘అసోసియేషన్’ ట్విస్ట్.. లీగల్ క్లారిటీ కోసమేనా?

కవిత పార్టీ పేరులో ‘అసోసియేషన్’ ట్విస్ట్.. లీగల్ క్లారిటీ కోసమేనా?

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీ పేరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS)గా పార్టీ పేరును ప్రకటించినప్పటికీ, విడుదల చేసిన లోగోలో మాత్రం “Telangana Rashtra Sena Association” అని చూపించడం చర్చనీయాంశంగా మారింది.పార్టీ పేరుకు చివరలో ‘Association’ అనే పదాన్ని చిన్న అక్షరాల్లో చేర్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. గతంలో ఉన్న TRS పార్టీ పేరుతో పోలికలు ఉండేలా చూసుకుంటూనే, ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా కాకుండా ఉండేందుకు ఈ మార్పు చేసినట్లు భావిస్తున్నారు.పాత పార్టీ పేర్లతో సమానంగా లేదా పోలి ఉండే పేర్లకు అనుమతి ఇవ్వడంలో నియంత్రణలు ఉన్న నేపథ్యంలో, ‘Association’ పదాన్ని జోడించడం ద్వారా లీగల్ సమస్యలను నివారించాలన్న ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది. దీంతో పార్టీ పేరు, గుర్తింపులో స్పష్టతతో పాటు చట్టపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకునే వ్యూహంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మొత్తంగా కవిత పార్టీ పేరు మాత్రమే కాకుండా, దాని లోగోలోని చిన్న మార్పే ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చకు కారణమైంది. రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి