బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

టెక్నాలజీతో మహిళ భద్రత.. లోకేశ్ ప్రశంసలు

టెక్నాలజీతో మహిళ భద్రత.. లోకేశ్ ప్రశంసలు

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతకు సాంకేతికత ఎంత కీలకంగా మారిందో మంగళగిరి పరిధిలో జరిగిన తాజా ఘటన స్పష్టంగా చూపించింది. శక్తి యాప్ సాయంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అర్ధరాత్రి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.నంబూరుకు చెందిన యువతి బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకుని, అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. మార్గమధ్యంలో డ్రైవర్ అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అప్రమత్తమైన ఆమె వెంటనే శక్తి యాప్‌లో ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కింది. దీంతో ఆమె లొకేషన్ పోలీసులకు చేరింది.అలర్ట్ అందుకున్న మంగళగిరి పోలీసులు వెంటనే స్పందించి, లైవ్ లొకేషన్ ఆధారంగా ఆటోను కాజా సమీపంలో అడ్డగించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. యువతిని సురక్షితంగా ఇంటికి చేర్చారు.ఈ ఘటనపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ, మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని పేర్కొన్నారు. శక్తి యాప్ వంటి సాంకేతిక సాధనాలు మహిళలకు రక్షణ కవచంలా మారుతున్నాయని అన్నారు.పోలీసుల వేగవంతమైన చర్యలు, టెక్నాలజీ వినియోగం కలిసి పనిచేస్తే ఇలాంటి ఘటనలను సమర్థంగా ఎదుర్కొవచ్చని అధికారులు తెలిపారు. మహిళలు తమ భద్రత కోసం ఇలాంటి యాప్‌లను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్