బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జునకు పెళ్లి ఆహ్వానం అందజేసిన బెల్లంకొండ శ్రీనివాస్

సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జునకు పెళ్లి ఆహ్వానం అందజేసిన బెల్లంకొండ శ్రీనివాస్

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నేపథ్యంలో ఆయన కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. వివాహ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతుండగా, ప్రముఖులను ఆహ్వానించే కార్యక్రమాన్ని బెల్లంకొండ కుటుంబం కొనసాగిస్తోంది.ఈ క్రమంలో సాయి శ్రీనివాస్ తన తండ్రి బెల్లంకొండ సురేష్ తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలుసుకుని వివాహానికి ఆహ్వానించారు. అలాగే ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ను కూడా ప్రత్యేకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సాయి శ్రీనివాస్ వివాహం కావ్యారెడ్డి అనే యువతితో జరగనుంది. ఏప్రిల్ 29న తిరుమల లో ఈ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే ఈ జంట నిశ్చితార్థం హైదరాబాద్‌లో సాదాసీదాగా జరిగింది. అయితే వివాహాన్ని వైభవంగా నిర్వహించేందుకు బెల్లంకొండ కుటుంబం సిద్ధమవుతోంది. ఈ వేడుక టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారగా, పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి