Breaking News

ఆఫ్టర్‌కేర్ పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సీతక్క

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “చైల్డ్ సేఫ్టీ – ప్రొటెక్షన్ & సే నో టు డ్రగ్స్” కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆఫ్టర్‌కేర్ పిల్లలకు అవసరమైన కీలక ధ్రువపత్రాలను ఆమె పంపిణీ చేశారు. బాలల రక్షణ, యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు, హైదరాబాద్ జిల్లా అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైల్డ్ కేర్ సంస్థల్లోని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి సీతక్క 1055 మంది ఆఫ్టర్‌కేర్ పిల్లలకు ఆధార్, ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. ఇది రాష్ట్రంలోనే ఒక రికార్డు స్థాయి కార్యక్రమంగా నిలిచింది.ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేసి, “సే నో టు డ్రగ్స్” పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ సంరక్షణలో ఉన్న పిల్లలు స్వతంత్ర జీవితంలోకి అడుగుపెట్టేందుకు అవసరమైన అన్ని సహాయాలు అందిస్తున్నామని తెలిపారు.గతంలో సర్టిఫికెట్ల కోసం ఎదురైన ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం ముందడుగు వేసిందని, ఈ ధ్రువపత్రాలు విద్య, ఉపాధి అవకాశాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు. కుటుంబ సహాయం లేకపోయినా కష్టపడి ముందుకు వచ్చిన విద్యార్థులను అభినందిస్తూ, వారి భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించిన మంత్రి, క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రతి అర్హుడికి ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, బాలల భద్రత, పునరావాసం, మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.చివరగా, ప్రతి చిన్నారి భద్రంగా ఉండాలని, ప్రతి యువకుడు సరైన దిశలో ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.

మంత్రి పేరుతో మోసం.. కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిపై కేసు

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం.. కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *