బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విశాఖకు చేరుకున్న మంత్రి నారా లోకేష్.. ఘన స్వాగతం

విశాఖకు చేరుకున్న మంత్రి నారా లోకేష్.. ఘన స్వాగతం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. యువత ప్లకార్డులు చేతబూని ఉత్సాహంగా ఆహ్వానం తెలిపింది.టీడీపీ నేత చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో “జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ (వైజాగ్)” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ లోకేష్‌కు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. మంత్రి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అభిమానుల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో జరుగనున్న శతాబ్ది ఉత్సవాల్లో మంత్రి పాల్గొననున్నారు. ఈ వేడుకలకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఉత్సవాలకు విచ్చేసే అతిథులకు సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ స్వాగతం పలకనున్నారు. అనంతరం రాత్రి నోవాటెల్ హోటల్‌లో Google ప్రతినిధుల గౌరవార్థం ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొననున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్