బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఇంధన కొరతపై షర్మిలా ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఇంధన కొరతపై షర్మిలా ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై రాజకీయంగా వేడెక్కిన పరిస్థితుల్లో వైఎస్ షర్మిలా ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా లోపం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.షర్మిలా మాట్లాడుతూ, “పెట్రోల్ లేదు.. డీజిల్ లేదు.. ప్రభుత్వం లేదు” అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల ప్రాథమిక అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని అన్నారు.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయని, ప్రజలు ఎండలో ఇంధనం కోసం వేచి ఉండాల్సి వస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ పరిస్థితి రోజువారీ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు.ప్రభుత్వం ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా నియంత్రించడంలో విఫలమైందని ఆరోపించిన షర్మిలా, వెంటనే సరఫరా వ్యవస్థను సరిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఆరోపణల మధ్య ఇంధన కొరత సమస్య రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్