బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖ.. గూగుల్ ప్రాజెక్టుతో కొత్త యుగం ప్రారంభం: పల్లా శ్రీనివాసరావు

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖ.. గూగుల్ ప్రాజెక్టుతో కొత్త యుగం ప్రారంభం: పల్లా శ్రీనివాసరావు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు పడుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచ టెక్ దిగ్గజం Google డేటా సెంటర్ శంకుస్థాపనతో విశాఖ అభివృద్ధిలో చారిత్రాత్మక మలుపు తిరగనుందని పేర్కొన్నారు.సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో, 600 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ మెగా ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. 2028 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ డేటా సెంటర్ ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పెట్టుబడులకు అనుకూల విధానాల వల్లే ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని కొనియాడారు. అలాగే మంత్రి నారా లోకేష్ కృషి, వేగవంతమైన అమలు సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు పునాది వేసిందని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టుతో విశాఖలో ప్రపంచ స్థాయి సాంకేతిక మౌలిక వసతులు అభివృద్ధి చెందడంతో పాటు, ఐటీ ఆధారిత పరిశ్రమలు విస్తృతంగా పెరుగుతాయని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతం టెక్నాలజీ మరియు పరిశ్రమల కేంద్రంగా రూపుదిద్దుకుని యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.ఇది కేవలం ఒక డేటా సెంటర్ ప్రాజెక్టు మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాప్‌పై నిలబెట్టే కీలక మైలురాయిగా నిలుస్తుందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్