బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌.. ఏపీకి గేమ్‌ చేంజర్: సీఎం చంద్రబాబు

విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌.. ఏపీకి గేమ్‌ చేంజర్: సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ ఒక కీలక మలుపు తిరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రానికి కొత్త దిశ ప్రారంభమైందని అన్నారు. తర్లువాడలో సుమారు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న Google డేటా సెంటర్‌కు సీఎం భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టును ఏపీ అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా అభివర్ణిస్తూ, దేశ ఆర్థిక వృద్ధికి ఇది గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని చెప్పారు.గూగుల్ రాక ఉత్తరాంధ్రకు గర్వకారణమని, ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పడుతుందని సీఎం వెల్లడించారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఏఐ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విశాఖకు ఉన్న అద్భుతమైన కనెక్టివిటీ, పారిశ్రామిక వాతావరణం పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అనకాపల్లి, విశాఖకు త్వరలో గోదావరి నీళ్లు అందించే ప్రణాళికలు అమల్లో ఉన్నాయని వివరించారు.అదే సమయంలో పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాలకు ముందే పూర్తి చేస్తామని, 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ తొలి దశను పూర్తిచేస్తామని సీఎం వెల్లడించారు. విశాఖను ఏఐ సిటీగా, అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.టెక్నాలజీ రంగంలో దేశానికి గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని, పెట్టుబడిదారులతో భాగస్వామ్యంతో అభివృద్ధిని వేగవంతం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్