బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం… డెల్టాతో కీలక భేటీ

ఏపీలో పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం… డెల్టాతో కీలక భేటీ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రెసిడెంట్ బెంజిమన్ లిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో డెల్టా ఇన్నోవేషన్ మరియు ఆర్&డీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. ఈ సెంటర్ ద్వారా స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్ సాఫ్ట్‌వేర్, డేటా సెంటర్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ వంటి ఆధునిక సాంకేతికతలపై పరిశోధనలు జరగనున్నాయి. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న డేటా సెంటర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని థర్మల్, పవర్ మేనేజ్‌మెంట్ మౌలిక వసతుల సరఫరా కోసం ప్రత్యేక తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు.అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) తయారీ, అసెంబ్లీ యూనిట్‌ను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. ఈ యూనిట్‌లో బ్యాటరీ ర్యాక్స్, పవర్ కండిషనింగ్ సిస్టమ్స్ (PCS), ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (EMS) తయారీ జరుగుతుంది.డెల్టా ఎలక్ట్రానిక్స్ సంస్థ పవర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, మొబిలిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీకి 51 ఫ్యాక్టరీలు, 73 ఆర్&డీ సెంటర్లు, 157 సేల్స్ ఆఫీసులు ఉన్నాయి.భారతదేశంలో కూడా డెల్టా ఎలక్ట్రానిక్స్ విస్తరణపై దృష్టి సారించింది. 2027 నాటికి సుమారు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో తయారీ విస్తరణ, సరఫరా వ్యవస్థ బలోపేతం, సస్టైనబిలిటీ కార్యక్రమాలను చేపట్టాలని యోచిస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్