Breaking News

కవితపై దానం నాగేందర్ ఫైర్… కుటుంబ విభేదాలే కారణమని ఆరోపణ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. కవిత కొత్త పార్టీ ప్రకటనపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగా స్పందించారు.మీడియాతో మాట్లాడుతూ, కవిత తీసుకున్న నిర్ణయం వెనుక రాజకీయ కారణాల కంటే కుటుంబ విభేదాలే ప్రధానమని ఆరోపించారు. ముఖ్యంగా తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ‘రోబో’గా వ్యాఖ్యానించడం సరైంది కాదని మండిపడ్డారు.రాష్ట్రంలో “రాక్షస పాలన” నడుస్తోందన్న కవిత ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని, అభివృద్ధి పనులు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు.తెలంగాణ అభివృద్ధిలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల రంగాల్లో పురోగతి కనిపిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో కవిత విమర్శలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటుతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మరింత పెరిగింది. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశముంది.

తెలంగాణ భవన్‌లో ఘనంగా మే డే ఉత్సవాలు – పాల్గొన బీఆర్ఎస్ నేతల

మల్కాజిగిరికి కొత్త పోలీస్ కమిషనర్.. బి. సుమతి నియామకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *