బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కొత్త పార్టీపై రాజగోపాల్ రెడ్డి సెటైర్లు… “పాన్ షాప్ పెట్టినంత సులభం”

కొత్త పార్టీపై రాజగోపాల్ రెడ్డి సెటైర్లు… “పాన్ షాప్ పెట్టినంత సులభం”

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కవిత కొత్త పార్టీ నిర్ణయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ సీఎం కేసీఆర్‌ను కవిత బహిరంగంగా విమర్శించడం సరైంది కాదన్నారు. ఒక ఉద్యమ నాయకుడైన తండ్రిని తన తొలి సమావేశంలోనే విమర్శించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కుటుంబ విలువలు, రాజకీయ సంస్కృతి కాపాడాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుందని సూచించారు.కవిత తనను “అమ్మ”గా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, తండ్రికి గౌరవం ఇవ్వని వ్యక్తి తెలంగాణకు అమ్మ ఎలా అవుతారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.కొత్త పార్టీ స్థాపనపై వ్యంగ్యంగా స్పందిస్తూ, “డబ్బులు ఉంటే పార్టీ పెట్టడం పాన్ షాప్ పెట్టినంత సులభమైపోయింది” అని సెటైర్లు వేశారు. తెలంగాణలో కవిత నాయకత్వంపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.కుటుంబ విభేదాలను రాజకీయ వేదికపైకి తీసుకురావడం తగదని, వ్యక్తిగత అంశాలను పక్కనబెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. కవిత ఎన్నికల్లో పోటీ చేసినా విజయం సాధించడం కష్టమేనని వ్యాఖ్యానించారు.కవిత కొత్త పార్టీ ప్రకటనతో ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో కదలికలు మొదలయ్యాయి. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశముంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి